హైపర్ ఆది కి జబర్దస్త్ లో నచ్చిన కమెడియన్ అతనా.. అసలు గెస్ చేయలేరు..

జబర్దస్త్ కామెడీ షో తో క్రేజ్‌ సంపాదించుకొన్ని సెలబ్రిటీలు గా మారిన వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీం లో మెంబర్ గా చేరిన హైపర్ ఆది.. తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి భారీ సక్సెస్ తో దోచుకుపోతున్నాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం కి ఆయన లీడర్. ఇక స్కిట్లో ఆయన వేసే జోకులు విచ్చ‌ల‌విడిగా బ్లాస్ట్ అవుతాయి. కామెడీతో నాన్ స్టాప్ పంచలతో స్కిట్ అయ్యే వరకు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉండే హైపర్ ఆది.. స్కిట్ మొత్తాన్ని వన్ మ్యాన్ షో గా ఆడిస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ అండ్ టీంకు గట్టి పోటీ ఇచ్చే కమెడియన్స్‌లో హైపర్ ఆది ఒకడు. అనంతరం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా హైపర్ ఆది పరిశోధనలో సందడి చేశాడు.

టీవీ: పెళ్లిపై హైపర్ ఆది పరువు తీసిన పొట్టి నరేష్..

ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న ఆది.. ఢీ డ్యాన్స్‌ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూ అవుతున్నాడు. కాగా హైపర్ ఆది ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. జోర్దార్ పార్టీ విత్ సునీత అనే టాక్ షో కి వచ్చిన ఆది.. ఈ షోలో హోస్ట్గా వ్యవహరిస్తున్న జోర్దార్ సుజాతతో ముచ్చటించాడు. అయితే సుజాత మాట్లాడుతూ మీకు పొట్టి న‌రేష్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం అంట కదా అని అడిగింది. అవునన్నా హైపర్ ఆది కారణాలు చెప్పుకొచ్చాడు.

Hyper Aadi & Naresh ''Imitating Ram Gopal Varma" | Sridevi Drama Company |  15th January 2023 - YouTube

నరేష్ అంటే నాకు చాలా ఇష్టం.. నరేష్ కి హైట్ ప్రాబ్లం ఉంది.. అందుకు ఎప్పుడు కృంగిపోడు.. ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తాడు.. సాధించి చూపించాడు. ఈ వయసులో నరేష్ ఒక్కడే కుటుంబం మొత్తాన్ని పోషించగలుగుతున్నాడు.. అందుకే నరేష్ అంటే నాకు ఆ అభిమానం, ప్రేమ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా హైపర్ ఆది వెండితెర మీద కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పాతికకు పైగా సినిమాల్లో కమెడియన్‌గా కనిపించినా.. బుల్లితెర రేంజ్‌లో వెండితెరపై ఆది కామెడీ పండడం లేదు. దీంతో వెండితెరపై స్టార్ కమెడియన్ గా పాపులర్ కాలేకపోతున్నాడు.