తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..ఈ హీరో తమ్ముడుని కూడా తొక్కేస్తున్నాడుగా..?

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం .. మాయలోకం అని అందరికీ తెలుసు.. కానీ మరి రక్తసంబంధాన్ని తొక్కేసే అంత రంగుల ప్రపంచమా..? అంత కఠినంగా ఉంటుందా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్ గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక గ్యాంబ్లింగ్ అభిమానులను సైతం బాధపెట్టే విధంగా ఉంది . పేరుకి పెద్ద స్టార్ హీరో.. పలు సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు . అయితే తన కజిన్ ని మాత్రం ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేయడం లేదు.

ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చే మూమెంట్లో కూడా ఈయన సపోర్ట్ చేయలేదు. జనరల్ గా ఇండస్ట్రీలో ఒకరు హీరోగా ఎంట్రీ ఇస్తే పది తరాల వరకు బెర్త్లను కన్ఫామ్ చేసుకునేస్తూ ఉంటారు . అయితే ఈ హీరో నిజాయితీ అనుకోవాలో లేకపోతే నమ్మకద్రోహం అనుకోవాలో.. తన కజిన్ ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేయడం లేదు. సరే ఎవరో కాళ్లు పట్టుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సరే ..తన తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యే సమయానికే అన్న కూడా అదే తన సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు .

 

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు పైకి మాత్రం పెద్ద గొప్పలు చెప్పుకునే ఈ అన్నదమ్ములు బ్యాక్ గ్రౌండ్లో మాత్రం వాళ్లకు వాళ్ళ గోతులు తీసుకుంటున్నారట. ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఈ మాటలు ఈ డైరెక్టర్ దగ్గర ఆ మాటలు చెబుతూ ఇంటి పరువును బయట పెట్టేసుకుంటున్నారట. దీంతో జనాలు ఫన్నీగా పాత సామెతలు గుర్తు చేసుకుంటున్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..ఇండస్ట్రీలో ఎవరైనా ఒకటే అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!