సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఆ త్యాగం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడా.. ఇన్నాళ్లకు బయటపడ్డ రహస్యం..

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు చిరంజీవి. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి మెగా నట వారసులుగా ఎంతో మంది హీరోలను తీర్చిదిద్దున ఈయన.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో అవమానాలను, కష్టాలను అనుభవించాడు. మొదట్లో విలన్ పాత్రలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. తర్వాత దర్శకులను త‌న న‌ట‌నతో మెప్పించి హీరోగా మారాడు. అయితే 1987 లో తెరకెక్కిన ఖైదీ, అడవి దొంగ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి జాతకమే మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలతో ఆయన కెరీర్ మ‌లుపు తిరిగింది. అయితే ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ చేసిన త్యాగం వ‌ల్లే చిరంజీవి ఆ రేంజ్ లో సక్సెస్ సాధించాడు అంటూ.. చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కూడా కృష్ణ చేసిన అ త్యాగం కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ సినిమాలకు కృష్ణకు ఉన్న లింక్ ఏంటి.. సూపర్ స్టార్ కృష్ణ చేసిన త్యాగం ఏంటో.. ఒకసారి చూద్దాం. మొదటి సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి నటించిన అడ‌వి దొంగ‌ సినిమాను చేయాల్సి ఉంది. కానీ ఇదే కథతో చిరంజీవి సినిమా చేస్తున్నాడని తెలియడంతో.. కృష్ణ దర్శక, నిర్మాతలను కన్విన్స్ చేసి.. పోటీ క్యారెక్టర్ కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ సినిమాను వదిలేసుకున్నాడట. ఇక వీట్నెస్ పేరుతో హాలీవుడ్లో క్రైమ్ థ్రిల‌ర్‌గా రిలీజైన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. ఒక హత్యని ప్ర‌త్య‌క్షంగా చూసిన ఓ చిన్న పిల్లాడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఆ సమస్యల నుంచి ఎలా తప్పించుకున్నాడు.. అనేది స్టోరీ. ఈ సినిమాని మొదట మలయాళం లో తీశారు. అక్కడ సూపర్ హిట్ కావడంతో తర్వాత సత్యరాజ్ హీరోగా పువ్విజి వాసులే అనే పేరుతో తెరకెక్కించారు.

ఇందులో రఘువరన్ విలన్. ఇది తమిళ్లో కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమా తెర‌కెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా ఈ క్రమంలో సినిమా రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. ఈ విషయం తెలియ‌ని దర్శక, నిర్మాత విజయ్ బాపు నాయుడు వీట్నెస్ సినిమాలు చూసి సాక్షి మూవీ పేరుతో ఒక కథ తయారు చేశాడు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవిల‌ను హీరో, హీరోయిన్‌లుగా పెట్టి మూవీ తీయాల‌ని భావించాడు. అయితే కృష్ణ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక షూటింగ్ మొదలుపెట్టే టైంలో చిరంజీవి ఇదే కథ‌ను సినిమా చేస్తున్నాడని తెలియడంతో.. కృష్ణ ఈ సినిమాను వదులుకున్నాడట. అల కృష్ణ చేసిన త్యాగం వల్ల చిరంజీవి ఈ సినిమాలో నటించి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లను అందుకుంటు మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.