నన్ను, అమ్మని పిలిచి తాతగారు ఓ మాట చెప్పారు.. అది ఎప్పటికీ మర్చిపోను.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. న‌ట‌న‌ పరంగానే కాకుండా.. తన మంచితనంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్‌కు.. మొద‌ట నందమూరి కుటుంబ సభ్యుడిగా ఆదరణ లభించలేదు. వారి కుటుంబం ప్రేమ , ఆధ‌ర‌ణ అభించ‌డానికి తార‌క్‌కు చాలా సమయం పట్టింది. అది అంత ఈజీగా ఏమి జరిగిపోలేదు. మొదట్లో తార‌క్‌ తల్లి శాలిని ని, జూనియర్‌ ఎన్టీఆర్‌ని నందమూరి ఫ్యామిలీలోకి అసలు ఎంటర్ అవ్వనివ్వలేదు. అలాగే వారి ఇంట్లో జరిగిన ఏ ఫంక్షన్‌లో అయినా వీరిని అసలు పని మనుషుల లాగా కూడా చూసేవారు కాదు. ఇది తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన సత్యమే.

తండ్రి హరికృష్ణ మాత్రమే వారికి అండగా ఉండేవాడు. అయితే తాత ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ జూనియర్ ఎన్టీఆర్‌కి కొంతకాలానికి అందాయి. ఒకరోజు సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా శాలిని, తారక్‌ల‌ను పిలిచి కూర్చోబెట్టుకొని నా మనవడిని నా అంతటి వాడిని చేయాలి.. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్న.. నువ్వు ఎంత బాధ్యతగా ఇది తీసుకుంటావో.. నేను అంతే బాధ్యతగా దీన్ని భావిస్తా.. వాడిని జాగ్రత్తగా పెంచు అంటూ శాలినికి అప్పజెప్పారట. ఈ విష‌యం తార‌క్ స్వ‌యంగా ఓ సంద‌ర్శంలో వివ‌రించారు. అయితే ఈ విషయం జరిగిన కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించారు. తారక్‌ అంత చిన్న వయసులోనే ఎన్టీఆర్ మరణాన్ని జీవించుకోలేకపోయాడట.

ఎంతగానో ఏడ్చేవాడట. తన జీవితంలో ఉన్న కొండంత అండని కోల్పోయానని విషయం తారక్ కి అప్పుడే అర్థమైంది. ఇక హరికృష్ణ మాత్రమే మళ్లీ తారక్కు అండ అని.. నందమూరి కుటుంబం అంతా వారిని ఎక్కడికో విసిరేస్తారని అందరు అనుకున్నారు. కానీ దేవుడి దయవల్ల ఎన్టీఆర్ బతికున్న టైంలోనే తారక్ చేయవలసిన మంచి చేసేసారట.. తారక్‌ని హీరో చేయమని రాఘవేంద్రరావుకు ఆ బాధ్యత అప్పగించారట. ఆ టైంలో తండ్రి కృషి కారణంగా ఎన్టీఆర్ త్వరగానే ఇండస్ట్రీ లోకి అడుగు పుట్టాడు. తను నటనతో తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.