ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ స్టార్ హీరో.. ఇంతకీ మూవీ ఏంటంటే.. ?

ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ లైన‌ప్‌ను ఏర్పాటు చేసుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివా డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హీట్లతో పాటు కొన్ని డిజాస్టర్ సినిమాల‌ను కూడా చెవిచూశాడు. అలా ఎన్టీఆర్ నటించిన ఓ డిజాస్టర్ సినిమాతో కోలీవుడ్ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. టీనేజ్‌లోనే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రిలతో వరుస సక్సెస్లను అందుకున్ని స్టార్ హీరోగా మారాడు. మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పారుచుకున్నాడు. ఎన్టీఆర్‌కు ఇలా వరుస‌గా న‌టించిన అన్ని సినిమాలు హిట్ కావ‌డంతో తన నెక్స్ట్ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అయితే ఈ మూడు సినిమాల తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో ఆంధ్రావాలా రిలీజైంది. వీరిద్దరు కాంబోలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఈ సినిమాకు పాటలు అందించాడు. ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను ఓ ఊపుఊపాయి.దీంతో తార‌క్ ఈ మూవీతో బ్లాక్ బ‌స్టర్ కొట్ట‌డం కాయమని ఫ్యాన్స్ అంత ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి కానుకగా 2004 జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా చూసేందుకు మొదట ప్రేక్షకులు అంతా ఎగబడ్డారు. అయితే బెనిఫిట్ షో నుంచి సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో సినిమా పై అంచనాలు మెల్లమెల్లగా తగ్గాయి. దీంతో మూవీ ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. యంగ్ ఏజ్ లోనే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించడం.. ముంబై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆయనకు వర్కౌట్ కాకపోవడంతో.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిటై ఉంటే టాలీవుడ్ ఎన్టీఆర్ రేంజ్ మరో లెవెల్ లో ఉండేది.

అయితే ఎన్టీఆర్‌కు డిజాస్టర్ ఇచ్చిన ఈ స్టోరీని.. మరోసారి పూరీ జగన్నాధ్‌.. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో తెరకెక్కించాడు. పూరి జగన్నాథ్ కు పునీత్ రాజ్ కుమార్ కు మధ్యలో మంచి సానిహిత్యం ఉంది. పునీత్ రాజ్ కుమార్ ను అప్పు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాథ్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్స్ సాధించి రికార్డులను సృష్టించింది. మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ అంటే పునీత్ రాజ్ కుమార్ కు ఎప్పుడు ప్రత్యేక గౌరవం ఉండేది. ఇదే సినిమాను తెలుగులో ఇడియట్‌గా తెర‌కెక్కిస్తే ఇక్కడ కూడా ఆ సినిమా హిట్ కొట్టింది. అయితే ఆంధ్రవాల‌ స్టోరీని కన్నడ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి వీరకన్న‌డి అనే టైటిల్ తో సినిమాలో రిలీజ్ చేశాడు పూరీ జగన్నాథ్. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ బాగా వర్కౌట్ అయింది. ఆ విధంగా ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ఆంధ్రవాల‌.. వేరే చోట‌ రీమేకై పునీత్ కు భారీ సక్సెస్ అందించింది.