కుర్రాళ్లలో హీట్ పెంచేస్తున్న అనుపమ కామెంట్స్.. ఆ కోరిక తీరిస్తే నేను మీ సొంతం అంటూ..

టాలీవుడ్ ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవ‌స‌రం లేదు. త‌న అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఈగిల్ సినిమాతో ఇటీవల అలరించిన అనుపమ.. ప్రస్తుతం తమిళ్ లోను సైర‌న్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక‌ ప్రస్తుతం ప్రాజెక్ట్ అని పూర్తిచేసుకుని ఖాళీగా ఉండడంతో లైఫ్ ఎంజాయ్ చేసే పనిలో బిజీ అయ్యింది. అయితే అనుపమ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.

ఇటీవల బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకునేందుకు మారిషన్‌ వెళ్లి వెకేషన్ ఎంజాయి చేసిన ఈ బ్యూటీ అక్క‌డ దిగ్గిన‌ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అయితే తాజాగా అనుప‌మ‌ కుర్ర కారుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అనుప‌మ‌ తన స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసుకుంది. బేబీ హిప్పోరస్ ఉన్న ఫోటోను ట్యాగ్‌ చేస్తూ.. వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీ సొంతం అవుతా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంటే బేబీ హిప్పోరస్ తీసుకువచ్చిస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ హింట్ ఇచ్చింది.

ఇక ఇప్పటికే అనుప‌మా పరమేశ్వరన్ ఓ క్రికెటర్‌ను లవ్ చేస్తుద్దంటూ.. టాలీవుడ్ హీరోను ప్రేమిస్తున్నట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం అనుప‌మ ఇచ్చిన ఈ జాక్ పాట్ ఆఫర్‌ను కుర్రాళ్ళు ఉపయోగించుకుంటారో లేదో చూడాలి. ఇక ఇటీవ‌ల అనుప‌మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం అనుపమ చేసిన ఈ పోస్ట్ పెట్టింత వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కామెంట్లు చేస్తున్నారు. నటున‌తో అందరిదీ ఆకట్టుకుంటే అనుపమ మరి తన పెళ్లి వార్తలు ఎప్పుడు చెబుతుందో చూడాలి.