వార్ని.. చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమాలో నటించారా.. ఆ మూవీ ఏంటంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మార్చ్ 1న‌ తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో వరుణ్ జోడిగా బాలీవుడ్ నటి మానుషి చిల్లర హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ మరింత దగ్గర పడడంతో.. వరుణ్ తేజ్ ప్రమోషన్స్ కు మరింత జోరు పెంచారు. కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న వరుణ్‌.. ఈ క్రమంలో తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే వరుణ్ నటించిన ఫస్ట్ మూవీ ఏది అనగానే మనకు ఠ‌క్కునే గుర్తుకు వచ్చేది ముకుంద. హీరోగా వరుణ్ ఇండ‌స్ట్రీకి పరిచయమైన మూవీ అదే.

కానీ అంతకుముందే బాలనటుడుగా వరుణ్ తేజ్ సినిమాల్లో నటించాడు. అదే టైంలో మెగాస్టార్ చిరంజీవి తోను ఓ సినిమాలో కనిపించాడు. ఇంతకీ చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఏంటి అనుకుంటున్నారా. హ్యాండ్సప్‌. నాగబాబు, బ్రహ్మానందం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలాగే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బాల‌ నటుడిగా మెప్పించాడు. ఈ సమయానికి వరుణ్ తేజ్ వయసు కేవలం పదేళ్లు మాత్రమేన‌ట‌. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెర‌కెక్కింది. ఈ సినిమాకు జయసుధ కథను అందించారని టాక్. అంతేకాదు ఇందులో ఓ ముఖ్య పాత్రలో కూడా ఆమె నటించింది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సోనుసూద్‌ను కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సీన్ లోనే వరుణ్ తేజ్ కూడా కనిపించి అలా ఓ రెండు డైలాగులు చెప్పేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో నటించాడని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ మూవీలో చిరంజీవి కూడా ఉండడం విశేషం. ఇక ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఆపరేషన్ వాలంటైన్‌లో వరుణ్ తేజ్ పైలెట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నవదీప్, రూహిణి శర్మ కీలకపాత్రలో నటించారు. తెలుగు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మట్కా సినిమా షూటింగ్లో బిజీ అవుతాడు వరుణ్.