ప‌రిక్ష‌ల టైంలో పిల్లల జ్ఞాపకశక్తిని పెంచేందుకు.. తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్..

ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. పిల్లల చదువుపై ఒత్తిడి, భయం మొదలవుతాయి. ఈ టైం లో పిల్లలు ఎంతో షార్ప్ గా పని చేయాల్సి ఉంటుంది. చదివినవన్నీ బ్రెయిన్ లో గుర్తుంచుకోవాలి. అయితే కొంతమంది పిల్లలు ఒకసారి చదివిన వాటిని బ్రెయిన్ లో ఫీడ్ చేసేసుకుంటారు. మరి కొందరు మాత్రం చదివినవి ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టిన తర్వాత టెన్షన్ లో మర్చిపోతూ ఉంటారు. దీంతో పరీక్షల్లో సఫలం అవుతారు. అయితే పిల్లలు చదివినవి గుర్తు పెట్టుకోవాలంటే పేరెంట్స్ ఈ చిన్న టిప్స్ ఫాలో చేయిస్తే ఫలితం ఉంటుంది.

అవేంటో ఇప్పుడు చూద్దాం. పరీక్షల టైంలో పిల్లల చదివినవి గుర్తుండాలంటే.. మొదట వాళ్ళ మెమొరి పవర్ పెరగాలి. సుడోకు, క్రాస్‌వ‌ర్డ్, పజిల్స్ లాంటి ఆటలు కారణంగా పిల్లల బ్రెయిన్ మరింతగా షార్ప్ అవుతుంది. దీంతో వారి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. కనుక జ్ఞాపకశక్తి కోసం ఇలాంటి బ్రెయిన్ షార్ప్ గేమ్స్ ఆడిస్తూ ఉండాలి. ఒక ప్రశ్నకు పేజీలు పేజీలు సమాధానం రాయాల్సి వస్తుంది. అలాంటి సమాధానం గుర్తుపెట్టుకోవడం పెద్దవాళ్ళకే కష్టమవుతుంది. ఇక పిల్లలు ఆ సమాధానాన్ని గుర్తుంచుకోవాలంటే దానిని సింపుల్ ట్రిక్స్ తో చిన్న చిన్న పదాలుగా గుర్తుండేలా పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. అలా నేర్చుకున్న సమాధానాన్ని వాళ్ళు ఆ ప్రశ్నలను త్వరగా మర్చిపోరు. శరీరానికి సరైన వాటర్ లేకపోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి బలహీనమవుతుందట.

డిహైడ్రేషన్ కారణంగా మనం స్ట్రెస్‌కు లోనవ్వడం.. అది జ్ఞాపకశక్తిని దెబ్బతీయడం లాంటివి జరుగుతాయి. అందుకే పిల్లలు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగేలా పెద్దలు చూసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్స్ సమయంలో చాలామంది టెన్షన్ కి గురవుతూ ఉంటారు. అలాంటివారికి ధ్యానం అనేది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ధ్యానం, వ్యాయామం జ్ఞాపకశక్తి పెరుగుదలకు కూడా సహకరిస్తాయి. కనుక పిల్లలు ఉదయం లేవగానే కొంచెం సేపు ధ్యానం, ఎక్సైజ్ అలవాటు చేయించాలి. ఇక సరైన నిద్ర, ఆహారం లేకపోయినా వారు చేసే పని పై శ్రద్ధ పెట్టలేరు. టైం టు టైం తిని నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే చేసే పని పై వారికి శ్రద్ధ ఉంటుంది. పనిలో సక్సెస్ సాధించగలుగుతారు.