‘ కన్నప్ప ‘ మూవీ లో బాలయ్య పాత్ర ఏంటో తెలుసా.. రోజు రోజుకు సినిమా అంచనాలు పెంచేస్తున్న విష్ణు..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఇటీవల సెట్స్‌ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా రూపొందుతుంది. ఇక మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్న‌ప్ప పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్‌ పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. తాజాగా ఈ లిస్టులో నందమూరి నట‌సింహం కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు భక్త కన్నప్ప లో బాలకృష్ణ కనిపించబోతున్నాడట. ఈ స్టోరీ పరంగా ఓ పాత్రకు బాలకృష్ణ అయితేనే కచ్చితంగా సెట్ అవుతాడని మేకర్స్ భావించారట. దీంతో మంచు విష్ణు, మోహన్ బాబు.. బాలయ్యను కలిసిస్టోరి వినిపించ‌న్నునార‌ని టాక్‌.

Kannappa (Movie) Release Date, Cast, Director, Story, Budget and more...

అయితే ఈ న్యూస్ వార్తలు వైరల్ అవడంతో బాలయ్య నో చెప్తాడా ఒకే చెప్తాడా అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. మోహన్ బాబు బాలయ్యను కలిసినప్పుడు ఈ సినిమాకు ఒక‌వేళ నో చెప్పినా ఇబ్బంది లేదని ముందుగానే చెప్పాలనుకుంటున్నారట. అయితే బాలయ్య ఇప్పటివరకు గెస్ట్ రోల్ లో చాలా తక్కువ సినిమాల్లో నటించాడు. అవి కూడా దాదాపు తన తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాలే కావడం విశేషం. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళి విష్ణు నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో మాత్రం బాలయ్య గెస్ట్ రోల్‌లో కనిపించాడు. భారీ అంచనాల మధ్యన రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా థియేటర్లో ఆడిందంటే కేవలం బాలయ్య బ్రాండ్ కు ఉన్న క్రేజ్ మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యను రావణబ్రహ్మ పాత్ర కోసం అడగబోతున్నారని సినీవర్గాల సమాచారం.

Vishnu Manchu,Vishnu Manchu - MAA Elections: గెలిచిన మంచు విష్ణు.. జై జగన్  నినాదాలతో మార్మోగిపోతోన్న ప్రాంగణం - vishnu manchu won in maa elections  2021 - Samayam Telugu

ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ ఈ పాత్రకు బాలయ్య కచ్చితంగా ఓకే చెప్తారని.. అంతా భావిస్తున్నారు. అయితే కచ్చితంగా బాలయ్య కన్నప్పలో రావణబ్రహ్మగా కనిపిస్తే సినిమా క్రేజ్ వేరే లెవెల్ కు వెళ్లి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇక‌ ప్రస్తుతం ఎలక్షన్ బిజీలో గ‌డుతున్న బాలయ్య.. ఈ సినిమాకు డేట్స్ ఇవ్వగలడా.. లేదా.. అనేది సందేహం. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో పూర్తయింది. కాస్త గ్యాప్ తర్వాత తాజాగా సెకండ్ స్కేడ్యూల్‌ ప్రారంభించిన వీడియోను మంచి విష్ణు సోష‌ల్ మీడియా వేదిక‌పై షేర్ చేసుకున్నాడు. ఇందులో మోహన్ బాబు, విష్ణు కనిపించారు. ఇక ఈ స్కెడ్యూల్స్‌లో ఒళ్ళు గగ్గురు పొడిచే సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక న్యూజిలాండ్, థాయిలాండ్, ఇండియాకు చెందిన అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో పనిచేస్తున్నారు.