రాముని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ జాతకం చూసిన రేలంగి.. ఏం చెప్పాడంటే..?

తాజాగా అయోధ్యలో శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతినోటా జైశ్రీరామ్ అనే నినాదమే వినిపించింది. అంగరంగ వైభవంగా ఈ ముచ్చట జరిగింది. టీవీలో లైవ్ షో తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. ఇక అయోధ్యకు వెళ్ళిన వారికి ప్రత్యక్ష రామ దర్శనం కూడా లభించింది. అయితే మన తెలుగు వారందరికీ రాముడైన, కృష్ణుడైన సినీ రంగంలో ఠ‌క్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు ఆ మహాపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయన రాముడు రూపం లో లేదా కృష్ణుడు రూపంలో ఉన్న పటాలని ఇప్పటికీ ఎంతో మంది తమ ఇళ్లల్లో దేవుళ్ళుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు.

ల‌వ‌కుశ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రాముడి కటౌట్ లో ఎన్టీఆర్ కి మేకప్ వేసి తీసుకువచ్చారట‌. ఆయన అలా నడుచుకుంటూ వస్తున్న షార్ట్ తీయాలని మేకర్స్ భావించారు. అలా వస్తున్న ఆయనను చూసి అందరూ అచ్చం శ్రీరాముడిలా ఉన్నారు అంటూ భక్తి భావంతో చప్పట్లు కొట్టారట. అయితే అక్కడే ఉన్న కమెడియన్ రేలంగి ఆనందం పట్టలేక వెంటనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయనను హత్తుకొని చేయి ఇలా ఇవ్వండి అంటూ హస్త సాముద్రికంలో ఎంతో జ్ఞానం ఉన్నా రేలంగి ఎన్టీఆర్ భవిష్యత్తును కూడా చెప్పాడట.

ఎన్టీఆర్ 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా ఎన్నో అద్భుత శిఖరాలను అధిరోహిస్తారని.. దేశం గర్వపడే స్థాయిలో ఉంటారని ఆ రోజు నన్ను కచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటూ ఎన్టీఆర్‌కు చెప్పాడట. అక్కడే ఉన్న అంజలీదేవి సీతా రూపంలో తధాస్తు అన్నారట. ఆయన చెప్పినట్లుగానే 50 ఏళ్ల తర్వాత నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే గొప్ప రికార్డును సృష్టించాడు. లవకుశ సినిమా తీసే టైం కి ఎన్టీఆర్ కు 40 ఏళ్ళు మాత్రమేనని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోను, రాజకీయాలోను ఆయన ఎన్నో రికార్డులను సృష్టించి తెలుగునాట దైవంగా మారాడు.