పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం ద్వారా గ్యాస్ తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

3. అలానే గొంతు నొప్పితో బాధపడే వారికి శొంఠి పాలు తీసుకోవడం ద్వారా విముక్తి పొందవచ్చు.

4. శీతాకాలంలో కొందరికి కాళ్ల నొప్పులు ఇబ్బందులు మొదలవుతాయి. అలాంటివారు శొంఠి పాలు తాగితే తగ్గుతాయి.

5. శొంఠి పాలలో క్యాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న‌ శొంఠి పాలు తప్పకుండా తాగండి.