“జీవితంలో అది లేకపోతే చాలా కష్టం”..వైరల్ అవుతున్న మెగా కోడలి మాటలు..!!

లావణ్య త్రిపాఠి.. మెగా ఇంటి కోడలు అయ్యాక అమ్మడి జోష్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఫస్ట్ కమిట్ అయిన సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. అంతకుముందు లావణ్య త్రిపాఠి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ ప్రచారం జరిగిన .. ఆ తర్వాత అలాంటిది ఏదీ లేదు అని పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తాను అని అభిమానులకు ప్రామిస్ చేసింది .

రీసెంట్ గా ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ సిరీస్లో లావణ్య కు సపోర్టింగ్ గా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ నటించారు . ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . “నిజజీవితంలో మీరు ఎంతవరకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు ..?”అని మీడియా వారు ప్రశ్నించగా..

” నిజం చెప్పాలంటే పర్ఫెక్షన్ కూడా ఒక సమస్య ..మనం ఉన్నట్లు మన పక్కవాళ్ళు ఉండరు .. మనకు నచ్చినట్లు అస్సలు ఉండరు .. దీనివల్ల చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది. వరుణ్ చాలా పర్ఫెక్షన్ అతనికి చాలా ఓపిక ఉంటుంది .. అది నాకు చాలా ప్లస్ .. అందుకే మా ఇద్దరి పర్ఫెక్షన్ బాగా కుదిరింది “అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో మెగా కోడలు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంన్నాయి. కాగా గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిను ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సెన్సేషన్ గా మారాయి..!!