ఇంతకాలం లేడీస్ కి హీరోలు మాత్రమే క్రష్ అనుకున్నాము.. కానీ మొట్టమొదటిసారి ఓ డైరెక్టర్ కూడా అయ్యాడు.. ఆ అందగాడు ఎవరంటే

సాధారణంగా ప్రతి అమ్మాయికి కూడా ఈ తరం హీరోలంటే ఎంతో ఇష్టం. అలానే ఈ తరం హీరోలలో గర్ల్స్ కి చాలా మంది క్రష్ కింద ఉంటారు. వాళ్ల నటనకి అందానికి ఫిదా అయి వాళ్లకి క్రష్ అవుతూ ఉంటారు లేడీస్. కానీ మొట్టమొదటిసారి ఒక డైరెక్టర్ కి కూడా క్రష్ అయ్యారు లేడీస్ అందరూ.

ఆ దర్శకుడు మరెవరో కాదు.. ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ప్రతి ఒక్క అమ్మాయి మనసులో నిలిచాడు. క్రష్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నారు లేడీస్ . ఇక ప్రస్తుతం ఈయనకున్న లేడీస్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదని చెప్పొచ్చు. అంత ఫేమస్ అయిపోయాడు మరి.

చేసింది ఒక్క సినిమానే అయినా తన దర్శకత్వంతో పాటు తన మాటతీరుతో ప్రతి ఒక్క అమ్మాయిని ఆకట్టుకున్నాడు. మన టాలీవుడ్ లో మొట్టమొదటి డైరెక్టర్ క్రష్ గా నిలిచాడు. ఇక ఈయ‌న‌ ఫొటోస్ పై పలు లవ్ సాంగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.