నాగ్ ” నా సామిరంగా ” మూవీ 8 డేస్ కలెక్షన్స్ ఇవే..!

కింగ్ నాగార్జున తాజాగా నటించిన మూవీ ” నా సామి రంగ “. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు వహించారు. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

అంతేకాకుండా భారీ వసూళ్లను సైతం సాధించింది. ఇక ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 44.8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస చిట్లూరి నిర్మించిన ఈ మూవీ 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.35 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసి మొత్తం 21.89 కోట్లకు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల గ్రాస్ 44.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా 8 రోజుల వసూళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే…” నాగార్జున అని తక్కువ అంచనా వేశాను. ముసలోడే గాని మహానుభావుడు. ఓ రేంజ్ లో వసూళ్లను సాధించాడుగా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.