ట్రోలర్స్ ని మరింత రెచ్చగొడుతున్న హాట్ యాంకర్ రష్మీ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ ..

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ యాంక‌ర్‌గా రష్మీకి ఏ రేంజ్‌లో పాపులారిటీ వ‌చ్చిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. న‌టుడు, కమెడియన్ సుధీర్ తో పలు ప్రత్యేక షోలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు టీవీ షోలో టిఆర్పి రేటింగ్ కోసం అతనితో స్టేజిపై పెళ్లి కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు ఎప్పటి నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఇద్దరు స్పందించి క్లారిటీ ఇచ్చిన రూమర్లు మాత్రం ఆగడం లేదు.

కాగా రష్మి షోలో యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి షోలలో అలరిస్తున్న రష్మీ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప‌లు పోస్టులతో సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా జంతువులను హింసిస్తే ఆమె అసలు సహించలేదు. దీన్నిబట్టి ఆమె జంతు ప్రేమికురాలని సంగతి అందరికీ అర్థమవుతుంది.

అయితే బక్రీద్ పండుగ పురస్కరించుకుంటూ ముస్లింలు సాంప్రదాయంలో భాగంగా చేసే జంతుబలులను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించింది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు. తాజాగా దీనిపై రష్మీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘాటుగా కౌంటర్ వేసింది. అయోధ్య రామ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేళ ఒక పోస్ట్ తో ట్రోలర్స్‌ను మరింతగా రెచ్చగొట్టింది. ట్రోలర్స్ కి సమాధానం చెప్పే టైం నాకు లేదు.. నేను కాషాయ రంగు చీర సిద్ధం చేసుకుంటున్నాను. దీపాలు వెలిగించాలి.

ఇకపై ఏడాదికి రెండు దీపావళ్ళులు. రాముడు సీత తిరిగి ఇంటికి వచ్చేసారు. జైశ్రీరామ్ అంటూ రాసుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే రేష్మి యాంకర్ అనసూయ ను ఫాలో అవుతుందా ఏంటి.. పాపులారిటీ కోసం ఆమెలా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ యాంక‌ర్‌గా మారిపోయేలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరు ఏమన్నా తనదైన స్టైల్ లో స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చి పడేస్తుందన్న సంగతి తెలిసిందే.