అయోధ్య ఆహ్వానం అందినా.. ఎన్టీఆర్ వెళ్ళక పోవడానికి కారణం అదేనా..?!

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈమహ‌తర‌ కార్యానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మోడీ చేతుల మీదగా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇక అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో అన్ని రంగాల నుంచి వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుండి కూడా చాలామందికి ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఇండస్ట్రీలో ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలీవుడ్ అమితాబ్, రణ్‌బీర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కంగ‌నా ఇలా ఎంతోమంది సెలబ్రిటీస్ విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. రామ్ చరణ్‌తో పాటు తారక్ కూడా అయోధ్యకు వెళ్లి సందడి చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే తారక అయోధ్య వెళ్ళక పోవడానికి కారణం దేవర షూటింగ్ అని తెలుస్తుంది.

ముందుగా అనుకొని పెట్టుకున్న షెడ్యూల్ కారణంగా అక్కడికి వెళ్ళలేకపోయాడట. అదే రోజు దేవర లో సైఫ్‌ అలీ ఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉండగా.. స్కెడ్యూల్‌ డిస్టర్బ్ చేస్తే నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఉద్దేశంతో తారక్‌ అయోధ్యకు వెళ్లకుండా ఆగిపోయాడట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ గాయాల కారణంగా హాస్పిటల్ లో చేరారు. దీంతో ఆయన దేవరా సినిమా షూటింగ్‌లో గాయపడ్డారని తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.