సల్మాన్ ఖాన్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ప్రభాస్ తల్లి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ 1989లో మేనే ప్యార్ కియా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలోనే కాకుండా తెలుగులోనే రెండు సినిమాల్లో నటించి భారీ పాపులాటి దక్కించుకుంది భాగ్యశ్రీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చత్రపతి సినిమాలో కీలకపాత్రలో మెరిసిన ఈమె.. 2022లో వచ్చిన ప్రభాస్ మూవీ రాదేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కావడంతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రభాస్ రీల్ మదర్‌గా పేరు ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ సల్మాన్ ఖాన్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది.

నేను చదువుకునే టైం లో హిమాలయ దస్సాని అనే వ్యక్తితో ప్రేమలో పడ్డానని.. కానీ ఆ విషయం మా ఇంట్లో వారికి తెలియకుండా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాన‌ని చెప్పుకొచ్చింది. అయితే సల్మాన్ ఖాన్ తో మైనే ప్యార్ కియా సినిమా నటించాను.. ఈ మూవీ టైంలో సల్మాన్ ఖాన్ నా ముందు చాలా వింత వింతగా ప్రవర్తించేవాడు.. నా వద్దకు వచ్చి పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉండేవాడు.. నా చెవిలో ఏదో గుసగుసలు చేసేవాడు.. నాకు అతని ప్రవర్తన అస్సలు నచ్చలేదు అసభ్యకరంగా అనిపించడంతో అతన్ని పక్కకు పిలిచి ఎందుకిలా చేస్తున్నావ్ మ‌రోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండ‌దు అసలు సహించను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చా అంటూ చెప్పుకొచ్చింది.

అయితే సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ నాకు నీ లవ్ గురించి తెలుసు.. అందుకే అలా పాడుతున్న.. నీ బాయ్ ఫ్రెండ్ ని సెట్ కు తీసుకురా అంతా నేను చూసుకుంటా అని చెప్పాడు.. తర్వాత రోజు నేను హిమాలయ దస్సాని ని షూటింగ్ స్పాట్‌కు రమ్మన్నాను.. అయితే హిమాలయను చూసి సల్మాన్ ఫ్రెండే అనే అంతా అనుకున్నారు.. ఆ తర్వాత మా ఇద్దరిని కలిపేందుకు సల్మాన్ చాలా సహాయపడ్డాడు.. నేను నా ప్రియుడు 1990లో వివాహం చేసుకున్నాం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.