సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే.. న్యూస్ చెప్పిన అమితాబ్..!

ప్రస్తుతం మహేష్ నటించిన మూవీ ” గుంటూరు కారం “. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా అలా ఫినిష్ అయిందో లేదో మరోవైపు నెక్స్ట్ సినిమా కోసం రెడీ అయిపోయాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ చాలా వరకు లాక్ అయింది కూడా. ఏప్రిల్ లేదా మే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు 2026 కి ప్రాజెక్ట్ ఫినిష్ చేసి రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపూర్ రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించునున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం చిత్ర బృందం బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. గతంలో బాహుబలి కోసం కూడా రాజమౌళి అండ్ టీం అమితాబ్ని సంప్రదించారు. కానీ అప్పుడు అంతా ఓకే చెప్పలేదు. ఇక అనంతరం సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ చెప్పారు కూడా అమితాబ్. ఇక ఈ ప్రాజెక్టుకి అమితాబొకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమితాబ్ స్వయంగా తెలియజేశారు.