అయోధ్యలో రాముడిపై అలాంటి పోస్ట్ పెట్టిన అనసూయ.. సీక్రెట్ రివీల్..!

ఎంతోమంది కోట్లాదిమంది కల నిన్న నెరవేరింది. అయోధ్య ప్రతిష్ట అనేది ఇప్పటి కల కాదు 500 ఏళ్ల నాటికల. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక వెళ్ళలేని వారు దూరదర్శన్ ఛానల్ నుంచి లైవ్ చూశారు. ఇక తాజాగా యాంకర్ అనసూయ అయోధ్య రాముడు పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ” ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు ఇది. నేను హనుమంతుడికి పరమ భక్తురాలిని. ఆయన పేరు వచ్చేలా అన్న కొడుకు పేరు కూడా పెట్టాం. శ్రీరాముడే హనుమంతుడికి సర్వస్వం.

ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. ఇప్పుడు జరుగుతుంది. శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరాముడిని అయోధ్యలో దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న. రానున్న రోజుల్లో అది నెరవేరుతుంది. జై శ్రీరామ్ ” అంటూ తన పోస్ట్ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)