ఈ వారం శోభ ఎలిమినేట్‌.. ఈ 14 వారాల‌కి మోనిత‌ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుందో తెలుసా..?!

బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కచ్చితంగా ప్ర‌తి సీజ‌న్‌కు ఎవరో ఒక కంటెస్టెంట్ దత్తపుత్రుడు, లేద తత్తపుత్రిక‌గా ఉంటారు. అలా ఈసారి సీజన్లో కార్తీకదీపం మోనిత‌ అంటే శోభా బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. నెగిటివిటి ఉన్నా కూడా ఎన్ని తక్కువ ఓట్లు వచ్చిన 14 వారాల వరకు ఎలిమినేట్ కాకుండా హౌస్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. దీనితో శోభాశెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇక బయట విపరీతమైన నెగెటివిటీ ఉన్న శోభ‌పై నెగటివ్ కామెంట్స్ చేయడమే కాదు బయటికి వస్తే ఏం చేస్తామో తెలియదు అంటే బ్యాడ్‌ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

అయితే ఇంత నెగెటివిటీ ఉన్నప్పటికీ హౌస్ నుంచి ఆమె ఇంకా ఎలిమిట్ కాలేదు. దీంతో బిగ్ బాస్ మొత్తం ఫేక్ ఓటింగ్ అంటూ అప్పటికే పలు విమర్శలు వినిపించాయి. బిగ్ బాస్‌కు నచ్చిన వారిని ఇంట్లో ఉంచుతూ.. స్ట్రాంగ్ కంటెంట్లనే ఎలిమినేట్ చేస్తున్నారంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. కొంతమంది అయితే బిగ్ బాస్ ని చూడడమే ఆపేశారు. ఇక హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం, రెచ్చగొట్టడం చేస్తూ ఎప్పుడు చూసినా ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. శోభ గేమ్స్ లో బాగా ఆడినప్పటికీ ఓడిపోతే అసలు దాని తీసుకోలేదు.

BiggBossTelugu7 Promo 1 -Day 22 | Contestants become Judges at the  Nominations | Nagarjuna | StarMaa - YouTube

క్లోజ్ ఫ్రెండ్స్ పైన కూడా అరుస్తూ ఉంటుంది. ఈక్వాలిటీ వల్లే ఆమె సగం నెగిటివిటీ దక్కించుకుంది. అయితే ఇలా ఎప్పటికప్పుడు హౌస్ లో గొడవలు జరుగుతూ షో రసవత్తరంగా ఉంటేనే షో చూస్తారు అన్న ఉద్దేశంతో బిగ్ బాస్ ఇప్పటివరకు శోభను ఎల్మినేట్ చేయలేదని ఇక షో ఫైనల్ కు రావడంతో ఈసారి శోభా శెట్టిని పక్కగా బిగ్ బాస్ ఎలిమినేట్ చేయబోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ 14 వారాలకి శోభ కూడా బాగానే రెమ్యున‌రేషన్ అందుకుందట. వారానికి రెండు లక్షలు చొప్పున 14 వారాలకి ఆమెకు రూ.28 లక్షల వరకు ముట్టినట్లు తెలుస్తుంది.