మేకప్ వేయరు అని తెలిసి ..నాగ చైతన్య “తండేల్” సినిమాలో సాయి పల్లవి పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

నవ్వు తెప్పిస్తున్న సరే .. ఇదే వార్త నిజం అంటున్నారు సినీ మేకర్స్. స్టార్ హీరోయిన్ సినిమాలో మేకప్ వేయరు అని తెలిసి ఆ క్యారెక్టర్ నే వదులుకుందట ఆ అందాల ముద్దుగుమ్మ. ఆ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య హీరోగా తాజాగా నటిస్తున్న సినిమా “తండేల్”. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది .

గీత ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ప్లేస్ లో ముందుగా రష్మిక మందన్నాను అనుకున్నాడట చందు . అయితే ఆమె ఈ పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుంది అని తెలిసి రిజెక్ట్ చేసిందట .

ఆల్రెడీ పుష్ప సినిమాలో నాచురల్ గా నటించి మళ్లీ వెంటనే ఇంత నాచురల్ గా నటిస్తే ఎక్కడ తన కెరీర్ దెబ్బతింటుందో అన్న భయంతో .. ఈ పాత్రను మిస్ చేసుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు రిస్క్ చేసే సాయి పల్లవి మరోసారి ఈ సినిమాతో రిస్క్ చేయడానికి సిద్ధపడింది అంటున్నారు అభిమానులు..!!