40 ఏళ్లు దాటిన ఇంకా మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వని హీరోయిన్లు వీళ్లే.. అందరికీ ఒకే కామన్ పాయింట్…!

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా కామన్. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రేమలో పడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకుని జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో… విడిపోయి వారి జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రేమించి పెద్దల అంగీకారం లేకపోవడం వల్ల వీరు విడిపోయి..40 ఏళ్లు దాటుతున్న పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండిపోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

1. టబు:


స్టార్ హీరోయిన్ టబు ఓ స్టార్ హీరోతో రామాయణం నడిపింది. వీరి ప్రేమని పెద్దలు అంగీకరించకపోవడంతో ఇప్పటికి కూడా ఈమె పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది.

2. నగ్మా:


నగ్మా స్టార్ క్రికెటర్ గంగూలీని ప్రేమించింది. అతన్ని వివాహం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాల పాటు ఎదురుచూసింది. కానీ ఏమైందో తెలియదు కానీ వివాహం చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయింది.

3. శోభన:


సీనియర్ హీరోయిన్ శోభన కూడా ప్రేమలో విఫలం కావడంతో వివాహం చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయింది.

4. సితార:


నటి సితార ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఇక ఆ వ్యక్తి మరణించడం వల్ల ఆ బాధతోనే తన జ్ఞాపకాలని తలుచుకుంటూ ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయింది.

5. అనుష్క శెట్టి:


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఎవరిని ప్రేమిస్తుందో ఇప్పటివరకు రివిల్ చేయలేదు. కానీ ఈమె కూడా ప్రేమించిన వ్యక్తి కోసమే వివాహం చేసుకోకుండా ఉండిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా వారి ప్రేమ కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు ఈ హీరోయిన్లు. ఇక వీరంతా ప్రేమంటే ఇది అని మళ్లీ ప్రూవ్ చేశారని చెప్పాలి.