రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి రూపొందించిన క్షణం క్షణం, మనిమని, సర్కార్, రక్త చరిత్ర లాంటి సినిమాల్లో కూడా అతడి మేకింగ్ స్టైల్ లో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వర్మ సినిమాలో ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవడంతో సినిమాలను తగ్గించేశాడు.
మేకింగ్ క్వాలిటీ కూడా లేకపోవడంతో వర్మ రూపొందించిన సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ లతో బాగా పాపులారిటీ దక్కించుకుంటున్నాడు ఆర్జీవి. అయితే ఇప్పటికీ చాలా వరకు మేకర్స్ ఆర్జీవి మేకింగ్ స్టైల్ మర్చిపోలేరు. ప్రముఖ దర్శకులు కూడా ఆయన మేకింగ్ స్టైల్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి యానిమల్ మూవీ ఈవెంట్ లో వర్మని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ గురించి రాజమౌళి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ ఇచ్చే డైరెక్టర్లు వస్తారు.
కానీ సినిమాను ఇలా కూడా చేయవచ్చా ఫార్ములాను బ్రేక్ చేసి ఆడియన్స్‌ని షేక్ చేయవచ్చు అనే విధంగా సినిమాలు తీసేవారిలో రామ్‌గోపాల్ వర్మను చూశాను. తరువాత సందీప్ రెడ్డి వంగా మాత్రమే అలాంటి డైరెక్టర్. యానిమల్ సినిమాని అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా తీశాడు అంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో వర్మ దీనిపై స్పందించాడు. ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తూ తన గురించి ఇలాంటి వ్యాఖ్యలను తను ఎప్పుడు వినలేదంటూ షాకింగ్ ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆయన ఏ విషయం అయినా ఫన్నీ గానే తీసుకుంటాడు.. అలాగే రాజమౌళి లాంటి డైరెక్టర్ మాట్లాడిన మాటల్లో కూడా ఫన్నీగా తీసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.