తేనెతో ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయం..!!

ఈ మధ్యకాలంలో స్వచ్ఛమైన తేనె దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఏవేవో పదార్థాలు వేసి కల్తీ తేనె ను తయారుచేస్తూ ఉన్నారు.. అయితే అసలైన తేనెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేలా చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలోకి వేసుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు.మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.


రాత్రిళ్ళు పడుకునే ముందు కాస్త టీ స్పూను తో జాజికాయ పొడిని తేనెను కలిపి తీసుకుంటే నిద్ర సుఖంగా పడుతుందట. దీనివల్ల నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడవట.

కొన్ని ఘోర వెచ్చని నీటిని తీసుకొని అందులోకి కాస్త నిమ్మరసం వేసి తేనెను వేసి కలిపి తీసుకుంటే గొంతు సంబంధించిన సమస్యలు కూడా తగ్గడంతో పాటు పొడి దగ్గు కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

అధిక బరువును తగ్గాలనుకునే వారికి ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి తేనెతో కలిపి ఉదయం సాయంత్రం పూట తీసుకుంటే తగిన ఫలితం లభిస్తుంది.

మన శరీరంలో ఉండే మలినాలు సైతం బయటికి వెళ్లాలి అంటే డికాసిన్లోకి కాస్త తేనెను వేసుకొని కలిపి తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

దంతాలు నొప్పిస్తున్న వారికి కాస్త దాల్చిన చెక్క పొడిలోకి కొంచెం తేనెను వేసి దంతాలపైన రాస్తూ ఉంటే వాటి నుంచి నొప్పి తగ్గిపోతుంది.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కాస్త అల్లం రసం వేసుకొని తేనెను వేసుకొని తాగినట్లు అయితే.. సైనస్ అనే సమస్య నుంచి త్వరగా విముక్తి అవుతారట.