అనవసరమైన సినిమాలు చెయ్యను …..నవదీప్ సంచలన కామెంట్స్!

“జై” చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి, ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు నవదీప్. ఆ తరువాత “మనసు మాట వినదు”, “గౌతమ్ ఎస్ ఎస్ సి”, “చందమామ” వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారు. కానీ ఆ తరువాత అన్ని చెత్త సినిమాలు చేస్తూ, అనవసరమైన కథలను ఎంచుకుంటూ, తన పతనానికి తానె కారణమయ్యాడు. 2007 లో విడుదలైన చందమామ చిత్రం తరువాత నవదీప్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. గత కొన్నేళ్లుగా నవదీప్, హీరోగా కాకుండా పెద్ద హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా అనుచరుడిగా నటించి మెప్పించాడు నవదీప్. ఐతే ఇప్పుడు మళ్ళి లీడ్ రోల్స్ చెయ్యడం మొదలుపెట్టాడు నవదీప్. ఆహా నిర్మించిన “న్యూసెన్స్” వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సాధించింది. జర్నలిస్ట్ గా నవదీప్ నటన అందర్నీ ఆకట్టుకుంది.

ఓటిటి లలో వెబ్ సిరీస్ లతో మొదలుపెట్టి ఇప్పుడు వెండితెర పై హీరోగా దర్శనమివ్వబోతున్నాడు నవదీప్. దర్శకుడు అవనీంద్ర దర్శకత్వంలో “లవ్ మౌళి” అనే చిత్రంలో నటించాడు నవదీప్. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. పాంఖురి గిద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం టీసర్ ను సోమవారం విడుదల చేసారు మేకర్స్.

ఈ ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎన్నో అనవసరమైన చిత్రాలు చేసానని, ఇక నుండు తాను చెయ్యబోయే సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటానని, ఇక నుండి ప్రేక్షకులు నవదీప్ 2.0 ను చూస్తారని అన్నాడు నవదీప్. తాను ఎప్పుడు ఊహించని సాహసాలన్నీ ఈ చిత్రంలో చేసానని, ఇది తన మనసుకి బాగా దగ్గరగా అనిపించినా సినిమా అని అన్నాడు నవదీప్. తరువాత చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, తన జీవిత అనుభవాలే ఈ చిత్రం అని, ప్రేమను ఎంతో స్వచంగా, నిజాయతీగా ఈ చిత్రంలో చూపించమని అన్నారు.