” శ్రీ లీలతో అలా చేయడానికి చాలా కష్టపడ్డా “… నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు…!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా మూవీ ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ “. ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఈ మూవీ టీం. ఈ క్రమంలోనే నితిన్.. శ్రీ లీలపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ” ఈ సినిమాలో శ్రీ లీల నేను కలిసి ఓ మాస్ సాంగ్ కు అదిరిపోయే డాన్స్ వేసాము. ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా ఉంది.

ఈ క్రమంలో జానీ మాస్టర్ నా ప్రాణం తీసేశారు. శ్రీ లీల 20 లో నేను 40 లో ఉన్నాను. ఇద్దరి మధ్య ఎనర్జీ విషయంలో తేడా ఉంటుంది కదా… తన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి చాలానే కష్టపడ్డాను. కానీ ఆ మాస్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.