” చేతిలో ఫుడ్ లాక్కుని..చిత్రహింసలు పెట్టాడు “… ఆ డైరెక్టర్ పై నటి సంచలన కామెంట్స్..‌!!

కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” కాఫీ విత్ కరణ్ ” షో ప్రస్తుతం ఆడియన్స్ ఆదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు యంగ్ హీరో, హీరోయిన్స్ అటెండ్ కాగా… తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ, కాజోల్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ షోలో వీరి ముగ్గురు కలిసి సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఓ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కరణ్… షూటింగ్ టైంలో తన చేతిలో ఫుడ్ లాక్కుని.. చేయి చేసుకున్నట్లు ఫన్నీగా చెప్పుకొచ్చింది రాణి. దీంతో కరణ్ షాక్ కాగా.. ఇది ఫిజికల్ అబ్యూజ్ కిందకు వస్తుందని పగలబడి నవ్వేసింది కాజోల్. ఇక తాను మెహబూబ్ స్టూడియోలో ఓ సినిమా చిత్రీకరణ చేస్తుండగా.. తన తండ్రి ఆ స్టూడియో ముందు రోడ్డుపై నడుస్తూ కనిపించాడని తెలిపాడు కరణ్.

ఇక దీంతో సంజయ్ దత్.. యశ్ జి మీరెందుకు ఇక్కడ ఉన్నారని ప్రశ్నించగా..” నా కొడుకు లోపల సెట్ వేశాడు. నన్ను బయటకు పంపేశాడు ” అని సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. ఇక మొత్తానికి ఈ వీక్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యదట్టే ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.