బిగ్ బాస్ సెట్ లో నాగార్జున ధరించిన స్వెట్ షర్ట్ ధర ఎంతో తెలుసా …?

ఆరు పదుల వయసు మీదపడుతున్నా, నాగార్జున ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు. కనిపించడమే కాదు, ఆయన పనితనం కూడా అలానే ఉంది. తన కొడుకులకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం “నా సామిరంగా” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ క్యారక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెరవేగంగా సాగుతుంది. ఒక వైపు సినిమాలతో పాటు, మరో వైపు రియాలిటీ షోలలో కూడా అంతే జోరుగా కనిపిస్తున్నారు నాగార్జున. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో, “బిగ్ బాస్” కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్, విజయవంతంగా 7 వ సీజన్ ను ప్రారంభించింది. వారమంతా హౌస్ లో కంటెస్టెంట్ లను చూపించే బిగ్ బాస్ షోకి వీకెండ్స్ లో నాగార్జున వచ్చి సందడి చేస్తారు.

ప్రతి వారం లాగానే, ఈ వారం కూడా నాగార్జున తన స్టైలిష్ లుక్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. నాగార్జున ధరించే దుస్తులు ఎప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఆయన ఒక స్టైల్ ఐకాన్. ఎప్పటిలాగానే ఈ సారి కూడా నాగార్జున తన డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “లూయిస్ విట్టన్” స్వెట్ షర్ట్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించారు. యధావిధిగా అభిమానులు ఆ స్వెట్ షర్ట్ ధరను తెలుసుకునే పనిలో పడ్డారు. నాగార్జున ధరించినది లూయిస్ విట్టన్ లిమిటెడ్ ఎడిషన్ స్వెట్ షర్ట్. దీని ధర 1.82 లక్షలు గా ప్రముఖ ఇంస్టాగ్రామ్ పేజీ “సెలబ్రిటీ అవుట్ ఫిట్ డీకోడ్” తెలిపింది. ఇది తెలిసిన ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ స్వెట్ షర్ట్ స్వచ్ఛమైన కాశ్మీరీ ఉన్నితో తయారుచేయబడిందట. అందుకే దీనికింత వెల. లూయిస్ విట్టన్ ఒక ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్.

ఇదిలా ఉండగా, నాగార్జున నా సామిరంగా చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫేర్ విజయ్ బన్నీ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మిర్న మీనన్, ఆషిక రంగనాథన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.