“బోయపాటితో సినిమాకు అలాంటి కండిషన్ పెట్టిన బన్ని…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ” సరైనోడు ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకున్నారు. ఇక వారు కోరుకున్నట్లుగానే బోయపాటితో అల్లు అర్జున్ మూవీ ఓకే అయ్యిందట.

కానీ బోయపాటికి ..బన్నీ కొన్ని కండిషన్స్ పెట్టక తప్పలేదు అంటున్నారు. ఎందుకంటే ” పుష్ప ” సినిమా తర్వాత బన్నీ ఇమేజ్ మారిపోయింది. అందుకని ఆచితూచి అడుగు వేయాలి. లేదంటే పాన్ ఇండియా స్థాయి నుంచి వెనక్కి వచ్చేసే అవకాశం ఉంది.

ఇక దీనికి తోడు రీసెంట్ గా బోయపాటి శ్రీనివాస్ రూపొందించిన ” స్కంద ” సినిమా డిజాస్టర్ అవ్వడం. ఈ సినిమా కారణంగా బోయపాటి కెరీర్ కు కొంత బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. ఈ కారణాలు చేతే బన్ని బోయపాటికి కొన్ని కండిషన్స్ పెట్టాడని సమాచారం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.