హీరోయిన్ లయ ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ హీరో.. ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదే..

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్టర్ సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ తర్వాత వచ్చిన ప్రేమించు మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సాయికిరణ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. తర్వాత పలు సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమాల్లో నటించాడు. ఇక కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు లాంటి సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయికిరణ్ మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. లయ‌తోటి నటించిన ప్రేమించు మూవీ పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లయ ఈ సినిమాలో బ్లైండ్ గా నటించడానికి ఒక వారం పాటు ట్రైనింగ్ తీసుకుందని.. ఆమె నటనకు ఈ సినిమా నేషనల్ అవార్డు వరకు వెళ్లిందని.. నీ లైఫ్ లాంగ్ ఈ మూవీ గుర్తుండిపోతుంది అంటూ రామానాయుడు ఆమెతో అన్నారంటూ చెప్పుకొచ్చాడు. అలాగే లయతో పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ చూడడానికి జంట బాగుంది పెళ్లి చేస్తే బాగుంటుందని మా తల్లిదండ్రులు కూడా భావించారంటూ వివ‌రించాడు.

అయితే మా మధ్యలో లవ్ లాంటివి ఏమీ లేవు.. మేము కూడా కుదిరితే చేసుకుందాం అనుకున్నాం.. కానీ మా జాతకాలు కలవలేదు.. అందువల్ల ఈ పెళ్లి సెట్ కాలేదు.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఆ తర్వాత ఇంద్రజిత అలాగే తిమ్మారెడ్డి భారద్వాజ్‌ ఎంత బాగుందో మూవీలో కూడా నటించాం. మా తల్లిదండ్రులు జాతకాలు నమ్ముతారు. ఒకప్పుడు నేను కూడా బాగా నమ్మే వాడిని.. వాటిని గురించి కూడా తెలుసుకున్న అంటూ చెప్పుకొచ్చాడు సాయికిరణ్. ప్రస్తుతం సాయికిరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.