శృతి హాసన్ బోల్డ్ ఫోటో షూట్…..వైరల్ అవుతున్న ఫోటోలు.

ఎంతో కాలంగా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో సినిమాలు చేస్తూ వన్ అఫ్ ది టాప్ హీరోయిన్స్ గా తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది శృతి హాసన్. కమల్ హాసన్ కూతురిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ కూతురిగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్ నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాల నటి గా మొదటిసారి వెండితెర పై నటించిన శృతి హాసన్, 2009 లో “లక్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయింది. ఈమె తెలుగులో నటించిన మొదటి చిత్రం “అనగనగా ఒక ధీరుడు”. ఆ తరువాత శృతి హాసన్ అనేక చిత్రాలలో నటించింది.

ఈ ఏడాది శృతి హాసన్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలలో నటించింది శృతి. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. వీటితో పాటు, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో లో వస్తున్న సాలార్ చిత్రంలో కూడా నటిస్తుంది శృతి. ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె కెరీర్ లో ఇదే అత్యధిక బడ్జెట్ సినిమా. ఇదిలా ఉండగా….వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, శరీతి హాసన్ సోషల్ మీడియాలో తన సందడిని ఏమాత్రం తగ్గించలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈమె, తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా శృతి ఒక బోల్డ్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ షూట్ లో ఆమె తన ఎద అందాలు కనిపించేలా గోల్డ్ కలర్ ట్యూబ్ టాప్, మరియు బ్లాక్ గౌన్ ధరించి ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలలో తన గ్లామర్ డోస్ పెంచింది శృతి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి.

ఈ ఏడాది శృతి హాసన్ సాలార్ తో పాటు నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న “హాయ్ నాన్న!” చిత్రంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శృతి “ది ఐ” అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.