” ఆ స్టార్ హీరో సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను “…. మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్…!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా మూవీ ” యానిమల్ “. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గెస్టులుగా.. మహేష్ బాబు, రాజమౌళి హాజరయ్యారు. అలాగే వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అతిథిగా విచ్చేసి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈయన మాట్లాడుతూ…” ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్ర బృందం వచ్చింది. మహేష్ బాబు గారు… నేను మీ సినిమా బిజినెస్ మాన్ చూసి రాజకీయాల్లోకి వచ్చాను. మీ సినిమా పది సార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణ్‌బీర్ నేనొక విషయం చెప్పాను. అప్పట్లోనే నేను చెప్పాను.

బాలీవుడ్, హాలీవుడ్ ను తెలుగు హీరోలు రూల్ చేస్తారు. మా తెలుగు వాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు ‌.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా వచ్చాడు. హిందుస్థానీ రూల్ చేస్తోంది. పుష్ప తో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్లో దుమ్ము రేపుతున్నాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగు సార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడే సినిమా రిలీజ్ అయిన కూడా రూ.500 కోట్లు కలెక్షన్స్ వస్తాయి. సూపర్ హిట్ అందుకుంటాయి ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మల్లారెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.