మొబైల్ నీటిలో పడితే.. ఆ తప్పు మాత్రం చేయకండి..?

చాలామంది మొబైల్స్ సైతం ఎక్కువ ధరలు పెట్టి కొంటూ ఉంటారు. అయితే అలా అధిక దరి పెట్టి కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనం అనుకోకుండానే చేజారిపోయి కింద పడడం కానీ నీటిలో పడడం గానీ జరుగుతూ ఉంటుంది. నేల మీద మొబైల్ పడిన కేవలం గొరిల్లా గ్లాస్ మెటల్ డిజైన్ మాత్రమే దెబ్బతింటుంది. కానీ నీటిలో పడడం వల్ల వాటిని కాపాడడం అంత సులువు ఏమీ కాదు.. ఎందుకంటే మొబైల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము.. అయితే ఒకవేళ నీటిలో పడ్డప్పుడు ఈ చిన్న తప్పులు మాత్రం చేయకండి.

మొబైల్ నీటిలో పడగానే చాలామంది చేసి ఒక పెద్ద పొరపాటు ఆ మొబైల్ పనిచేస్తుందా లేదా అనేది కచ్చితంగా చెక్ చేస్తూ ఆగిపోయిన మొబైల్ ని ఆన్ చేస్తూ ఉంటారు.. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిధులు హెచ్చరిస్తున్నారు.

అయితే మొబైల్ నీటిలో పడిన తర్వాత వెంటనే బయటికి తీసి.. అందులో ఉండే సిమ్ కార్డ్ సైతం తీసివేయాలి. మొబైల్ ని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు విడదీయడం మంచిది..

ఆఫ్ లో ఉన్న మొబైల్ సైతం ఎక్కువగా డ్రై చేయడానికి ప్రయత్నించాలి.. ఏదైనా బియ్యం సంచిలో లేకపోతే టిష్యూ పేపర్ టవల్ తో వాటిని తుడిచేసి కొద్దిసేపు ఎండలో ఉంచడం మంచిది. బియ్యపు సంచిలో దాదాపుగా ఒక రోజంతా ఉంచడం మంచిది.

అయితే హెయిర్ డ్రయర్ తో మాత్రం డ్రై చేయడానికి ఉపయోగించకండి.

వీలైతే నోటితో ఊపి ఆ నీటిని సైతం బయటికి వచ్చేలా చేస్తూ ఉండాలి.

ఇలా ఎన్నో పద్ధతులను ఉపయోగించి మొబైల్ ని ఆన్ చేయడం మంచిది. మొబైల్ వాటర్ లో పడ్డప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయట. నీటిలో పడిన వెంటనే మొబైల్ ని ఆఫ్ చేయడమే మంచిదట.