రజినీ – లోకేష్ ప్రాజెక్ట్ లో ఓ యంగ్ హీరో ఎంట్రీ… ఇది కదా అసలు మజా అంటే…!!

రజనీకాంత్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన… రీసెంట్ గా ” జైలర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. అంతేకాదు సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి.

ఇక ఈ సినిమా అనంతరం ఈయన లైనప్ పట్ల రానున్న సినిమాల పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ లైనప్ లో అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయనున్న ” తలైవర్ 171 ” పై ఉన్న హైప్ వేరు. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

అదేంటంటే… ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో ఒకడైన శివ కార్తికేయన్ నటిస్తున్నట్లు తమిళ్ సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక దీని బట్టి చూసుకుంటే ఈ సినిమా కి లోకేష్ కనకగ‌రాజ్‌ గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా… సన్ పిక్చర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.