అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా… ఆ తెలుగు సినిమా నుంచే ” యానిమల్ ” కాపీ చేశారుగా…!!

యానిమల్ సినిమా హిందీలో రూపొందినప్పటికీ.. తెలుగులో కూడా ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది . అలాగే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి గెస్టులుగా హాజరయ్యారు.

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్ సినిమా గురించే డిస్కషన్ నడుస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ బట్టి చూసుకుంటే…” తండ్రి అంటే హీరోకి బాగా ఇష్టం. ప్రేమ కలిగి ఉన్న ఓ యువకుడు అనుక్షణం తండ్రిని రక్షించుకుంటూ ఉంటాడు. తన తండ్రికి ఏదైనా కష్టం వస్తే ఆ హీరో యానిమ‌ల్‌లా మారతాడు “. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ని తండ్రి కొడుకుల మధ్య వచ్చిన అనుబంధాన్ని చూసి చాలామంది కనెక్ట్ అయ్యారు.

కానీ ఈ ట్రైలర్ ని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూస్తే.. తెలుగు సినిమాలలో ఎక్కడో చూసినట్లుంది అని అనిపించక మానదు. సందీప్ డైరెక్షన్లో రూపొందిన యానిమల్ మూవీ కాన్సెప్ట్.. వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ” ధర్మచక్రం ” సినిమా కాన్సెప్ట్ లా ఉంది. ఇక ఈ సినిమా కూడా ఫాదర్, సన్ రిలేషన్ షిప్ మీదే రూపొందింది. ఇక యానిమల్ సినిమా లైన్ కూడా ఈ సినిమా నుంచే తీసుకుని ఉంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు.