యానిమల్ మూవీ ఈవెంట్లో మహేష్ వేసుకున్న ఈ సింపుల్ షర్ట్ కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ‌హేష్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన మహేష్ 50 ఏళ్ల వయసు భయపడుతున్న అదే క్రేజ్‌తో కొసాగుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీస్ వేసుకున్న బట్టలు, వాచ్, వారి ఆస్తి విలువలపై న్యూస్లు వైరల్ అవుతూనే ఉంటాయి.

Mahesh Babu Space (@SSMBSpace) / X

అదేవిధంగా తాజాగా మహేష్ బాబు వేసుకున్న సింపుల్ టీ షర్ట్ ధర హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక తాజాగా మహేష్ బాబు యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. నిజానికి మహేష్ బాబు ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్స్ కు చాలా సింపుల్ గానే వస్తూ ఉంటాడు. అలాగే యానిమల్ ఈవెంట్‌కు కూడా చాలా సింపుల్‌గా లైట్ కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకుని హాజరయ్యాడు.

Did Ranbir Kapoor Show Mahesh Babu Raha's Pics At Animal Event? X Thinks So  | Hindi News, Times Now

అది చూసిన ఆడియన్స్ అందరూ మహేష్ అంటేనే సింపుల్ గా ఉంటారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే మహేష్ ధరించిన సింపుల్ టీషర్ట్ కాస్ట్ మాత్రం అంత సింపుల్‌గా లేదు. ప్రస్తుతం దాని కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఆ ఈవెంట్‌లో ధరించిన సింపుల్ షర్ట్.. కాటన్ విత్ ఫోర్ జి ఎంబ్రాయిడరీ అట. ఖరీదు అక్షరాల రూ.47,000 అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన నెట్టిజ‌న్స్‌ ఏంటి ఆ సింపుల్ టీషర్ట్ ద్వారా ఏకంగా రూ.47 వేల అంటూ ఆశ్చర్యపోతున్నారు.