ఇటీవల సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పైన మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. త్రిషకు మద్దతుగా చిరు మాట్లాడుతూ వక్రబుద్ధి కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ.. మన్సూర్‌ని విమర్శించాడు. ఇక అసలు విషయాన్ని తెలుసుకోకుండా చిరంజీవి విమర్శించాడు అంటూ మన్సూర్ అలీఖాన్ చిరువు పై ఫైరయ్యాడు. అంతేకాదు త్రిష, కుష్బూలతో పాటు చిరంజీవిపై కూడా పరువు నష్టం దాబా వేశాడు. చిరంజీవి మీద రూ.20 కోట్లు, త్రిష, ఖుష్బుల మీద రూ.10 కోట్లు చొప్పున పరువు నష్టం దాబా వేస్తున్నట్లు మన్సూర్ ఖాన్ వివరించాడు.
ఇంతటితో ఆగకుండా చిరంజీవి పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నాడు. కానీ పేదవాళ్లకు సహాయం చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నది వక్రబుద్ధి అన్నాడు కదా మరి ఆయనది ఏంటి..? పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవాళ్లకు సహాయం చేయకపోవటాని ఏం అంటారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు. ఆయన కూడా పార్టీ పెట్టాడు. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు.. ఇక చిరంజీవి గారు ప్రతి సంవత్సరం ఓల్డ్ హీరోయిన్ల పార్టీ ఇస్తాడు. ఆ పార్టీకి నన్ను పిలవడనుకోండి.. హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తాడు.
అది ఆయన అభిప్రాయం. కానీ నాపై విమర్శలు చేసే ముందు అసలు ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి తెలుసుకుంటే బాగుంటుంది.. అలా కాకుండా ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.. అవి నన్ను చాలా హర్ట్ చేశాయి. త్రిష కుష్బులపై రూ.10 కోట్ల చొప్పున చిరంజీవి పై రూ.20 కోట్ల చొప్పున పరువు నష్టం దాబా వేస్తా.. వచ్చిన డబ్బులు తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు అందిస్తా అంటూ మన్సూర్ వివరించాడు. ప్రస్తుతం మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారంగా మారాయి.