ఆ పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సూర్య… పాపం అంటున్న ప్రేక్షకులు (వీడియో)

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” కంగువా “. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని దాదాపు 38 భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే గతవారం షూటింగ్ సమయంలో సూర్య కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టం కొద్ది కేవలం గాయాలతో బయటపడ్డాడు.

Suriya: Suriya is having trouble walking.. Have you seen how he is after  the accident?.. Fans worship.. – Telugu News | Actor Suriya is struggling  to walk after the small accident in

ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు కూడా. తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు సైతం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం గాయం అయిన తరువాత తన భార్య జ్యోతిక తో కలిసి ముంబై కి వెళ్లి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడట సూర్య.

ఇక ఇందులో భాగంగానే తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూర్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో, వీడియో లలో సూర్య నడవడానికి కూడా కష్టపడుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో సూర్య నడవడానికి కష్టపడుతుంటే ఈయన భార్య హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.