సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్‌గా మ‌రీన బాల‌య్య‌..!

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకునేవాడే అస‌లు సిస‌లైన రాజ‌కీయ నాయ‌కుడు. తాను తండ్రికి త‌గ్గ సినీ, రాజ‌కీయ వార‌సుడినే అని మ‌రోసారి హిందూపురం ఎమ్మెల్యే న‌ట‌సింహం బాల‌కృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాల‌య్య సినిమాల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్ర‌కం, జాన‌ప‌దం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా స‌క్సెస్ అయ్యారు.

Sr NTR @ 100: Balakrishna To Kickstart Celebrations!

ఇక తండ్రితో పాటు అన్న హ‌రికృష్ణ ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూపురంలో బాల‌య్యకు 2014 ఎన్నిక‌ల‌ను మించిన మెజార్టీ వ‌చ్చింది. హిందూపురం అంటేనే ఇటీవ‌ల కాలంలో అసాధార‌ణ రాజ‌కీయాలు, వ‌ర్గాల‌కు నిల‌యం అయిపోయింది. అలాంటి చోట బాల‌య్య రెండోసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు హ్యాట్రిక్ కొట్టేలా దూసుకుపోతున్నారు.

Why did Balayya Babu not join the TDP protests? - TeluguZ.com

బాల‌య్య సాధార‌ణంగా హిందూపురంలో ఎక్కువుగా ఉండ‌రు. ఆయ‌న హైద‌రాబాద్ లేదా సినిమా షూటింగ్‌ల‌తోనే బిజీగా ఉంటారు. అయితే ఈసారి మాత్రం బాలయ్య తన పాత పద్ధతులకు భిన్నంగా హిందూపురంలో తన మార్క్ రాజకీయాలతో ప్రజలలోకి దూసుకుపోతున్నాడు. బాలయ్య చేపడుతున్న కార్యక్రమాలకు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణ చేస్తున్న పనులు చూసి అవాక్కవుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో బాలయ్యని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు.

Chandrababu Naidu, Balakrishna to lead massive rally in Hyderabad on  January 18

పార్టీ అధికారంలో లేకపోయినా బాలకృష్ణ తన నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ మొదలుపెట్టి ప్రతిరోజు కొన్ని వేలమందికి అన్నదానం చేస్తున్నాడు. అంతేకాకుండా తన తండ్రి పేరుతో ఆరోగ్య రథం ద్వారా తన నియోజకవర్గంలో ఉన్నపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో మద్యపాన నిషేధం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాడు. ఇలా బాలయ్య తన మార్క్ రాజకీయాలతో సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తాను నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు.