ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం. ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్‌ కొడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడుతూ ఉంటారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వదులుకున్న సూపర్ హిట్‌ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి కోన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Devadas Telugu Full Movie || Akkineni Nageswara Rao, Savitri - YouTube

దేవదాసు:
మన తెలుగు సీనియర్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఈ ఇద్దరు హీరోలు తెలుగు పరిశ్రమకు రెండు కళ్ళుగా ఉన్నారు. నాగేశ్వరరావు నటించిన దేవదాస్ సినిమా గురించి ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమాలో నాగేశ్వరరావు తాగుబోతు క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. అయితే ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్ కోసం రచించారట. అయితే ఎన్టీఆర్ దానికి నో చెప్పడంతో. నాగేశ్వరరావు ఆ పాత్రలో నటించి ఒదిగిపోయారు.

పాతాళ భైరవి:
సీనియర్ ఎన్టీఆర్‌కు స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పాతాళ భైరవి. అయితే ఎన్టీఆర్ కంటే ముందే నాగేశ్వరరావుకి సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. దీంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఆయన దానికి నో చెప్పడంతో ఈ సినిమా ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తెలుగులోనే తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

50 ఏళ్ళ క్రితమే ఇప్పటితో పోలిస్తే వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రమేంటో  తెలుసా.. | sr ntr movie adavi ramudu unknown facts , adavi ramudu, senior  ntr, unknown facts, record collections ...

అడవి రాముడు:
ఎన్టీఆర్ హీరోగా రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను ముందుగా శోభన్ బాబుతో చేయాలనుకున్నారట. కానీ ఆయన పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Chiranjeevi's Gang Leader won't re-release in theatres on December 31!  Here's why...

గ్యాంగ్ లీడర్:
చిరంజీవి కెరీర్‌లో ఖైదీ సినిమా తర్వాత ఆయన కెరీర్‌ను మరో మలుపు తిప్పిన సినిమా గ్యాంగ్ లీడర్. అయితే ఈ సినిమాను ముందుగా మెగా బ్రదర్ నాగబాబుతో చేయాలని అనుకున్నారు. అరె ఓ సాంబ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారట. అదే సమయంలో చిరంజీవి ఫోన్ చేసి కాల్ షీట్స్ ఉన్నాయి సినిమా చేద్దామని చెప్పడంతో అనుకోకుండా ఈ సినిమాలోకి చిరంజీవి వచ్చారు. అలా చిరంజీవి తన కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Pasivadi Pranam Telugu Full Length Movie | Chiranjeevi, Vijayasanthi,  Sumalatha - YouTube

పసివాడి ప్రాణం:
చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ సినిమా చిన్నపిల్లాడి చుట్టూ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాను వీట్నెస్ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ముందుగా కృష్ణ- శ్రీదేవితో మహేష్ బాబు తో కలిసి చేయాలనుకున్నారు. అయితే అదే సమయానికి అల్లు అరవింద్ ఆ సినిమా రీమేక్ హక్కులను కొనేయడంతో కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

Samarasimha Reddy : సమరసింహారెడ్డి కథ ఎలా పుట్టిందో తెలుసా? వారం రోజుల్లోనే  అది కూడా!! - Tolivelugu తొలివెలుగు

సమరసింహారెడ్డి:
బాలయ్య కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో సమరసింహారెడ్డి కూడా ఒకటి.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. అయితే ఈ సినిమాను ముందుగా విక్టరీ వెంకటేష్ తో చేయాలనుకున్నారు. ఆయనకు ఆ సినిమా స్టోరీ నచ్చకపోవటంతో వెంకీ నో చెప్పాడు. ఆ తర్వాత బాలయ్యకు స్టోరీ చెప్పక ఆయన వెంటనే ఓకే చేశాడు. ఇక సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Chanti Full Length Telugu Movie || Daggubati Venkatesh, Meena || Ganesh  Videos DVD Rip.. - YouTube

చంటి:
విక్టరి వెంకటేష్ సినీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మువీ చంటి. తమిళ సినిమా చిన్న తంబి సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రాజేంద్రప్రసాద్, కుష్భూలతో చేయాలని అనుకున్నారట. కానీ నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ తో చేయాలని చెప్పడంతో ఆయన హీరోగా నటించారు.

Pokiri release | పోకిరి స్పెష‌ల్ షో..గంట‌లోనే టికెట్స్ ఓవ‌ర్‌..!-Namasthe  Telangana

పోకిరి:
మహేష్ బాబు రికార్డు నెలకొల్పిన చిత్రం పోకిరి. పూరిజగన్నాథ్ ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలని అనుకున్నాడు. కానీ ఆయనకు డేట్స్ దొరకకపోవడంతో తరువాత చేద్దాం అని చెప్పాడట. కానీ మహేష్ బాబును కలిసి స్టోరీని వినిపించి కొన్ని మార్పులు కూడా చేశారట. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కలిసుందాం రా సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఎలా ఉందో...? - Chai  Pakodi

కలిసుందాం రా:
లవ్, కామెడీ, యాక్షన్ కలగలిపి వచ్చిన ఈ మూవీని ముందుగా నాగార్జునతో కలిసి చేద్దామనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది. ఈ సినిమాతో వెంకటేష్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇవే కాకుండా చాలా సినిమాలు ముందుగా ఒక హీరోతో అనుకుంటే ఆ తరువాత మరో నటుడితో చేయాల్సి వచ్చింది. అలా మారిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.