స్లీవ్‌లెస్ జాకెట్‌లో ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తున్న అనసూయ..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

పింక్ సారీ కట్టుకొని స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఫొటోలకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్‌లో ఈ ముద్దు గుమ్మ ఇంకా ముద్దుగా కనపడుతుంది. శారీలో అనసూయని చూసిన అభిమానులు ఆమె అన్నం బదులుగా అమృతం తాగుతుందేమో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నలబై ఏళ్ల వయసులో కూడా పదహారేళ్ల పడచు పిల్లలా తన అందాన్ని మెయింటైన్ చేస్తుంది అనసూయ.

అనసూయ తన చిన్న వయసులోనే సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. కెరీర్‌లో ఒక రేంజ్‌కి రాకముందే అనసూయ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తరగలేదు. కానీ పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కారణంగా చాలా మంది అనసూయని ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తుంటారు. ఒకప్పుడు ఆంటీ అంటే అనసూయకి కోపం వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం అంటే అనేవారిని పట్టించుకోవడం మానేసిందట. ప్రస్తుతం అనసూయ రంగమార్తండా సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో ఆమె నటించింది. ఇక ఇప్పుడు పుష్ప-2లో నటిస్తుంది. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుందట.