నందమూరి కుటుంబం నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఏమిటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నాడు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు వరించింది. ఇలా ఎన్టీఆర్ ఈ సినిమాతో తన క్రేజ్‌ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ప్రస్తుతం తార‌క్‌ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో రీసెంట్‌గా షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవునన్నాడు. అయితే ఇప్పుడు గత రెండు రోజులుగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చే వార్‌2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ బాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అయితే ఇప్పుడు ఈ నందమూరి కుటుంబంలో బాలీవుడ్ ప్రేక్షకులు అలరించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి వంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ త‌న కేరీర్ మొద‌టిలోనే హిందీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. యన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘పాతాళభైరవి’ (1952) హిందీలోనూ రీమేక్ అయింది. ఇక అక్కడ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. తరువాత మహానటి భానుమతి స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన త్రిభాషా చిత్రం (తెలుగు, తమిళ, హిందీ)- ఆ నాటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘చండీరాణి’ (1953)లోనూ రామారావు హీరోగా నటించారు.

ఈ సినిమా తెలుగులో కంటే హిందీలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ పై యన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రం ‘సంతోషం'(1955)ను తెలుగు, హిందీ భాషల్లో జూపిటర్ సంస్థ నిర్మించింది. హిందీలో ఈ చిత్రం ‘నయా ఆద్మీ’పేరుతో విడుదలై ముంబైలో 42 వారాలు విడుద‌లైంది.. ఇలా యన్టీఆర్ హిందీలో నటించిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఆయన నటించిన “లవకుశ, నర్తనశాల, పాండవవనవాసము” వంటి పౌరాణికా సినిమాలు కూడా హిందీలోకి అనువాదమై అక్కడా రజతోత్సవాలు జరుపుకున్నాయి.

Jr NTR and Hrithik Roshan set to clash in Ayan Mukerji's upcoming spy thriller War 2 [Watch Video]

యన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు హిందీలోకి అనువాదమయ్యాయి. 1992లో బాలకృష్ణ న‌టించిన‌ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ హిందీలో డబ్ అయి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది! ఇక నందమూరి మూడోతరం హీరో అయిన ఎన్టీఆర్‌ నటించిన ఎన్నో సినిమాలు హిందీలో విడుద‌లై మంచి విజ‌యలు అందుకున్నాయి. గత యేడాది పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’తో ఎన్టీఆర్‌ మరింతగా బాలీవుడ్ జ‌న్నీ ఆకట్టుకున్నాడు. ఎప్పుడు తన తాతను స్మరిస్తూ ఆయన బాటలోనే పయనిస్తున్నాన జూనియర్ యన్టీఆర్ ఇప్పుడు హిందీలో నటించబోయే త‌న తొలి సిమాతో ఏలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.