ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమాలు జాబితా దాదాపు కన్ఫర్మ్ అయింది. వచ్చే సంక్రాంతికి అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలు థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్‌లో సందడి చేయబోతుంది. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.
ఇప్పటికే తమిళ్ వర్షన్ కి సంబంధించిన మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టిన చిత్ర యూనిట్. తెలుగు వర్షన్ కి సంబంధించిన ప్రమోషన్లు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఇందులో దిల్ రాజు వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తెగింపు కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలతో పాటు మరో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి థియేటర్‌లో సందడి చేయబోతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జనాల్లోకి సినిమాలను తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మాస్ అభిమానులు అందరూ చిరంజీవి- బాలకృష్ణ సినిమాల కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీగా నిర్వహిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఇంకో 3 వారాల టైమ్ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి మొదలైంది. ఈ సంక్రాంతికి ఏ హీరో విజయం సాధిస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.