మైత్రి మూవీ మేకర్స్‌కు ల‌బ్‌డ‌బ్.. ల‌బ్‌డ‌బ్‌… మొడ‌పై క‌త్తి వేలాడుతోందా…?

స్టార్ హీరో సినిమాలనే పండగ సీజన్లో ఎంతో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించి ఆ సమయానికి విడుదల కావాలని అనుకున్న టైమ్‌ కి రిలీజ్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొన్నిసార్లు ఆ సినిమాల మేకర్స్ మెడ పై కత్తిలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత హై వోల్టేజ్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలయ్యకు జంటగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్ర యూనిట్. సినిమా రిలీజ్‌కు నెలరోజు టైమ్‌ కూడా లేదు ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశ లోనే ఉంది.

 

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం కోసం ఈ సినిమా యూనిట్ అంతా రాత్రి పగలు అని తేడా లేకుండా అనుకున్న సమయానికి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంక చివరి దశలోనే ఉంది.

రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ అంతా ఫ్రాన్స్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ షూట్ పూర్తయిందని చిరంజీవి ఇటీవల ఆ పాటలోని కొన్ని చరణాలను లీక్ చేసిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ టైమ్‌ దగ్గర పడటంతో సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా యూనిట్ అంతా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఈ రెండు సినిమాలకు నెలరోజుల టైమ్‌ కూడా లేకపోవడంతో ఈ సినిమాలో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు తన మెడ పై తానే కత్తి పెట్టుకుందని కామెంట్లు వస్తున్నాయి.

Chiranjeevi-Balakrishna: Balayya-Chiru Multistarrer .. Maitri Producers Key  Comments | Mythri Movie Maker Producer About Chiranjeevi Balakrishna Multi  Starrer Movie | PiPa News

అయితే ఇలాంటి అగ్ర హీరోల సినిమాల కోసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ కోసం టైమ్‌ కేటాయిస్తారు.. కానీ ఈ సంక్రాంతి వ‌స్తున్నఈ సినిమాల షూటింగ్‌లు ఇంకా పూర్తి కాకపోవటంతో మైత్రి వారికి ఊపిరాడటం లేదట. దీంతో వారు టెన్షన్ పడుతున్నారట. షూటింగ్ పూర్తి కాగానే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్స్ ని నిర్వహించాలని మైత్రీ వారు ప్లాన్ ని రెడీ చేశారట. భారీ ఈవెంట్ లతో పాటు ప్రమోషనల్ ఈవెంట్ లని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారట. అయితే వారి టీమ్ మెంబర్స్ కి మాత్రం ఈ సంక్రాంతి బిగ్ టాస్క్ గా మారింది.