2022 లో మరణించిన సినీ సెలబ్రెటీలు వీళ్లే..!!

ఈ ఏడాది సినీ పరిశ్రమలలో పలు విషాదాలు నెలకొన్నాయి ముఖ్యంగా తమ అభిమాన తారలను అభిమానులు కోల్పోవడం జరిగింది. అలా ఇప్పటివరకు ఈ ఏడాది ఎంతమంది మరణించారో ఒకసారి తెలుసుకుందాం.

1). లతా మంగేష్కర్:
కరోనా తో పలు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన బ్రీచ్ కండి ఆసుపత్రిలో మరణించింది.

2). బప్పిలహరి:
తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం కొన్ని చిత్రాలతో తన పాటలను పాడి అలరించిన బప్పిలహరి పలు అనారోగ్య సమస్యతో ఫిబ్రవరి 16వ తేదీన మరణించారు.

3). విక్రమ్ గోఖలే:
పలు అనారోగ్య సమస్యలతో నవంబర్ 26వ తేదీన కన్నుమూయడం జరిగింది.

4). కృష్ణంరాజు:
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి వైవిద్యమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణంరాజు. పలు అనారోగ్య సమస్యల కారణంగా సెప్టెంబర్ 11వ తేదీన మరణించారు.

5). ఇందిరా దేవి:
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఈమె భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీన మరణించడం జరిగింది. ఇక వీరి కుమారుడే సూపర్ స్టార్ మహేష్ బాబు.

6). రమేష్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకున్నారు. హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక పలు అనారోగ్య సమస్య కారణంగా జనవరి 8వ తేదీన మరణించారు.

7). సూపర్ స్టార్ కృష్ణ:
తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చిత్రాలు నటించడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టారు కృష్ణ. నవంబర్ 15వ తేదీన గుండెపోటుతో మరణించారు.