మళ్లీ ఆ కమెడియన్లకు అన్యాయం చేసిన మల్లెమాల సంస్థ..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నూకరాజు , ఇమ్మన్యూయల్ కూడా ఒకరు. కొంతకాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్లు నూకరాజుకు బాగానే వచ్చాయి. ఇక మరికొన్ని చానల్స్ లో ఆఫర్లు రావడం వల్ల కొంతమంది అటువైపుగా వెళ్లారు. కానీ నూకరాజు ఇమ్మన్యూయల్ మాత్రం జబర్దస్త్ లోని స్థిరపడ్డారు. కానీ వారికి మాత్రం మల్లెమాల అన్యాయం చేస్తున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి.

Jabardasth Emmanuel

ప్రస్తుతం వీరిద్దరూ జబర్దస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటిలో కమెడియన్లుగా ఉన్నారు. ఇంకా పలు కార్యక్రమాలలో కూడా వీరు కనిపిస్తూ ఉన్నారు. వీరిద్దరికి జబర్దస్త్ టీమ్ లీడర్ పదవి ఇవ్వలేదు.వీరిద్దరు కూడా టీమ్ లీడర్ అవ్వడానికి పూర్తి అర్హులైనప్పటికీ కూడా కొత్త టీమ్ ఎంపిక విషయంలో వీరిద్దరిని పక్కన పెట్టేశారు. ఈ మధ్యకాలంలో నూకరాజు చేస్తున్న ప్రతి స్కిట్ కూడా బాగా అందరిని అలరిస్తున్నది. మల్లెమాల వారు వీరిద్దరిని ఎందుకు టటీమ్ లీడర్ చేయలేదని వీరి అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది వీరిద్దరూ స్వయంగా టీం లీడర్లు అవ్వాలి అనుకుంటే మల్లెమాల వారే స్వయంగా వీరిని టీం లీడర్ చేసే అవకాశం ఉంది.

యాక్టింగ్ కోసం గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ వ‌దిలేసిన జబర్దస్త్ కమెడియన్కానీ వీరు మాత్రం టీమ్ లీడర్లు అవ్వాలని కోరిక లేదట .ఇతర కామెడీ కార్యక్రమాలలో అన్ని పాత్రలు చేయాలనుకుంటున్నట్లుగా వీరి సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర షోస్ యొక్క ఎపిసోడ్లు కూడా కార్యక్రమాలలో కనిపించాలని చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం .అందుకోసమే వీరిని టీం లీడర్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.