బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్టార్ కిడ్స్ను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తుంటాడు. అలాగే టాలెంట్ ఉన్న వారితో కలిసి సినిమాలను నిర్మిస్తుంటాడు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఇప్పటికే ఎందరినో పాపులర్ కూడా చేశాడు. ఇంతకుముందు వరకు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యాక్టర్స్ వైపు కూడా చూస్తున్నాడు. వారి సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. టాక్ షోలతో ఇంకా తదితర కార్యక్రమాలతో ఎప్పుడూ కెమెరా ముందే ఈ ప్రొడ్యూసర్ హీరో లెవెల్లో పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఇతను రష్మికను మీడియా ముందే ముద్దు పెట్టుకున్నాడు. దాంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయింది.
హీరోయిన్ రష్మిక పుష్ప సినిమాతో భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఉన్న ఈ హీరోయిన్ బాలీవుడ్లో సెటిల్ కావాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకోసమే అక్కడ సినీ అవకాశాల కోసం తిరుగుతూ, బాలీవుడ్ నిర్మాతలు దర్శకుల దృష్టిలో పడేందుకు అన్ని ఫంక్షన్లకు వెళ్తోంది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీ నటులందరూ విచ్చేసిన “గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022″ ఫంక్షన్‌కి రష్మిక కూడా వెళ్ళింది.
ఆ సమయంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ కనిపించింది. ఇంతలోనే అటువైపు నుంచి కెమెరాల ముందుకు వచ్చిన కరణ్ జోహార్ రష్మికతో కలిసి ఫొటోలకు పోజు ఇచ్చాడు. తర్వాత వెళ్తూ వెళ్తూ రష్మిక బుగ్గపై కిస్ ఇచ్చాడు. దాంతో కెమెరామెన్లు కూడా ఒకసారి ‘హో..’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కరణ్ జోహార్ ఒక్కసారిగా ముద్దు పెట్టుకోవడంతో రష్మిక కాస్త సర్ప్రైజింగ్గా ఫీల్ అయినట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.
Wouldn’t we love to see Karan Johar & Rashmika Mandanna collaborate for a project! 😍#zoomtv #karanjohar #rashmikamandanna #GraziaYoungFashionAwards2022 #GYFA2022 #GraziaYoungFashionAwards #GYFA #zoompapz #entertainment #bollywood pic.twitter.com/EMBbzTsqkS
— @zoomtv (@ZoomTV) December 16, 2022