సూపర్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ 6 ఫినాలే గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లో ఐదుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్న‌ర్‌ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్‌ నుంచి బయటకు వ‌స్త‌రో, సూట్ కేస్ తీసుకొని అమౌంట్ తో బయటకు ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 6 Telugu Grand Finale On Star Maa - L.V Revanth Is The  Winner

హౌస్ లో ఉన్న వారిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే రేవంత్ కు ఎక్కువ ఓటింగ్ ఉంది. కాబట్టి అతనే విన్ అయ్యే అవకాశాం ఎక్కువ‌గా కనిపిస్తుంది. రేవంత్ తర్వాత శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఇద్దరిలోనే బిగ్ బాస్ టైటిల్ పోటీ ఉంద‌న్ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ పైనల్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇప్పుడు హ‌ట్ టాపిక్‌ గా మారింది.

Bigg Boss Telugu 6 finale: 2 contestants to be removed from TOP 3

అయితే బిగ్ బాస్ ఫినాలే కు గెస్ట్ గా ఇప్పటి వరకు చిరంజీవిని ఆహ్వానించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ ప్లేస్ లో మరో మెగా హీరో రాబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కు గెస్ట్ గా వస్తున్న హీరో ఎవరు అన్నది ఇప్ప‌టివ‌ర‌కు కన్ఫామ్ లేదు. కానీ టాలీవుడ్ లో ఉన్నా ఓ స్టార్ హీరో రాబోతున్నాడని మాత్రం ఓ వార్త‌ గట్టిగా వినిపిస్తుంది. ఆ హీరో మ‌రి ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun opens up about 'Pushpa 2' release - Telugu News - IndiaGlitz.com

అల్లు అర్జున్ అనే బిగ్ బాస్ సీజన్ 6 కు గెస్ట్ గా రాబోతున్న‌డాని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ సీజన్ ఫినాలే కు గెస్ట్ గా వస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్‌ తేచ్చుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప2 సినిమాా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు పూర్తవుగా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. అనుకున్న టైం కు ఈ సినిమా పూర్తి అయితే 2023 డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బన్నీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.