చిరు చేతిలో ఉన్న ఈ బుడ్డది..ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది..ఎవరో గుర్తు పట్టారా..?

ప్రతి ఒక్కరికి వారి బాల్యం లో జరిగిన విషయాలు ఎంతో మధురానుభూతులు ఇస్తాయి. ఇక ఆ చిన్ననాటి రోజులు గుర్తు రాగానే ప్రతి ఒకరి పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. అయితే సెలబ్రిటీలు కూడా వారి చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసుకుంటూ ఆనందాన్ని వారి అభిమానులతో పంచుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు అందరూ కూడా వారి చిన్నప్పటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Niharika Konidela Childhood

 

అయితే ఎప్పుడు తాజాగా ఓ చిన్నారి చిన్నప్పటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఆ పాప ఎవరో గుర్తుపట్టండి.. ఆ పాపకి ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఫాలోయింగ్ కూడా ఉంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. సినిమాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా ఈమె రాణిస్తుంది. ఈమె ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు ఆ చిన్నారి పుట్టిన రోజు. ఎవరు గుర్తుపట్టారా.

చిరు చేతిలో ఉన్న చిన్నారి మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీ నుంచి ఏకైక హీరోయిన్. అయితే ఇప్పటివరకు మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. వారందరూ ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతుండగా తొలిసారిగా ఆ కుటుంబం నుంచి హీరోహియిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకుంది. ముందుగా యాంకర్‌గా బుల్లితెరపై తన కెరియర్‌ను మొదలుపెట్టిన నిహారిక.. ఆ తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Niharika Konidela Latest Photos - Lovely Telugu

ఆ తర్వాత మొదటి పెళ్లి చూపులు, ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్, హప్పీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహ రెడ్డి వంటి సినిమాలో నటించి మెప్పించింది. తమిళంలో విజయ్ సేతుపతికి జోడిగా నటించిన ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్ సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతగా మారిన తర్వాత హాలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించి సక్సెస్ అయ్యింది. ఈరోజు నిహారిక పుట్టినరోజు.