అవతార్ 2కి బ్యాడ్ రివ్యూస్ రావడానికి కారణాలివే.. 

ప్రస్తుతం ఎవరినోటా విన్నా అవతార్-2 సినిమా పేరే వినబడుతోంది. సినిమా చరిత్రలోనే అవతార్ అనేది ఒక అద్భుతమైన చిత్రం. సినీ ప్రేమికులకే కాదు, సినిమాలు చూడని వారు కూడా అవతార్ సినిమా చూడటానికి మొగ్గుచూపిస్తూ ఉంటారు. అవతార్ సినిమా వచ్చి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా దాని ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ అవతార్ సీక్వల్ రావాలని ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ఫలితంగా డిసెంబర్ 16న అవతార్-2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కానీ ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో అవతార్-2 సినిమా లేదు.

అవతార్ సినిమాకి వచ్చినంత క్రేజ్ అవతార్-2కి రావడం లేదు. ఈ సినిమాకి ‘ది గార్డియన్’ వెబ్‌సైట్ 2 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. మరికొన్ని వెబ్‌సైట్లు 2.5 రేటింగ్ ఇచ్చాయి. ఇక తెలుగు నిర్మాత సూర్య దేవర నాగవంశీ అయితే డాక్యుమెంటరీ అని ట్వీట్ చేశాడు. అసలు అవతార్-2 సినిమాకి ఫ్లాప్ టాక్ రావడానికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రన్ టైమ్‌

ప్రస్తుతం వచ్చే సినిమాలు అన్ని 2 లేదా 2:30 గంటల వ్యవధిలోనే పూర్తి అవుతున్నాయి. ఆ సమయానికి అలవాటు పడ్డ ప్రేక్షకులు అవతార్-2 సినిమా చూడటానికి 3 గంటల సమయాన్ని వేచించాల్సి వస్తుంది. దాంతో సినిమా కాస్త స్లోగా ఉందని, కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది అనే టాక్ వస్తుంది.

ప్రేక్షకులకు తెలిసిన గ్రహమే

అవతారు సినిమా ప్రేక్షకులకు తెలియని ఒక సరికొత్త గ్రహాన్ని పరిచయం చేసింది. అదే పండోరా గ్రహం. ఈ వింత గ్రహాన్ని వెండి తెరపై చూసి ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. కానీ మళ్ళీ అదే పండోరా గ్రహాన్ని అవతార్ -2 లో కూడా చూపించారు. దాంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి గంట సమయం లో మాత్రం సినిమా చాలా బాగుంది అని అంటున్నారు. ఆ చివరి గంట సముద్రం మధ్యలో విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయాని చెబుతున్నారు.

అవతార్-2 కథ ఎక్కడ ఉంది?

అవతార్-2 సినిమా చూసిన ప్రతి ఒక్కరూ విజువల్స్ బాగున్నాయని.. చివరి గంట సినిమా చాలా బాగుంది అని చెబుతున్నారు. అంతేకానీ ఈ కథలో కొత్త పాయింట్ చెప్పడానికి ఏమీ లేదు . ఎందుకంటే డైరెక్టర్ జేమ్స్ కామోరున్ ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా విజువల్స్ పై దృష్టి పెట్టారు. అయితే అవతార్ -2 సినిమా చూసిన చాలా మంది ఈ కథ, వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా లా ఉందని అంటుంటే, తమిళ ప్రేక్షకులేమో ‘అసురన్’ సినిమా లా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

• విజువల్స్ డామినేషన్

అవతార్ – 2 సినిమా విజువల్స్ స్క్రీన్ మీద ప్రతి అంశాన్ని డామినేట్ చేస్తున్నాయి. అంతే కాకుండా సాధారణ జనాలను తక్కువగా చూపిస్తూ, పండోరా గ్రహవాసులను ఏకువగా చూపించారు జేమ్స్. నిజానికి ఈ సినిమా కథ అలాంటిది మరి. కానీ ప్రేక్షకులకు సినిమా చుసినంతసేపు నిలిరంగు మనుషులు కనపడడం తో ఏకువగా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయారు.

• ఐమాక్స్ స్క్రీన్స్

అవతార్ సినిమాని చూడాలి అనుకునేవారు కచ్చితంగా 3D లో, బిగ్ స్క్రీన్ మీద చుస్తే ఆ సినిమా మజా ఉంటుంది. కాబ్బటి మీరు కూడా మీదుగా దెగర్లో ఉన్న ఐమాక్స్ స్క్రీన్ లాంటి బిగ్ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ లో అవతార్-2 సినిమా ని చూడండి.